NewSense - A Telugu Satirical Podcast

ఇంట్లోనే దర్యాప్తు చేయాలంటున్న MLC కవిత - ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి?

February 23, 2024 Babu - NewSense.Podcast@gmail.com Season 2 Episode 3
ఇంట్లోనే దర్యాప్తు చేయాలంటున్న MLC కవిత - ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి?
NewSense - A Telugu Satirical Podcast
More Info
NewSense - A Telugu Satirical Podcast
ఇంట్లోనే దర్యాప్తు చేయాలంటున్న MLC కవిత - ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి?
Feb 23, 2024 Season 2 Episode 3
Babu - NewSense.Podcast@gmail.com

ఇంట్లోనే దర్యాప్తు చేయాలంటున్న MLC కవిత
అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి? దాని  background స్టోరీ ఏంటి? 

2021 లో ఢిల్లీ లో క్రొత్త excise policy తీసుకొచ్చారు - ఈ క్రొత్త లిక్కర్ పాలసీ ఏంటి? ఎందుకు తీసుకొచ్చారు? 

ఎందుకు మళ్ళీ 2022 లో కొట్టేసారు? 

MLC కవితకి - ఈ లిక్కర్ స్కాము కి సంబంధం ఏంటి?


"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com

Show Notes Transcript

ఇంట్లోనే దర్యాప్తు చేయాలంటున్న MLC కవిత
అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి? దాని  background స్టోరీ ఏంటి? 

2021 లో ఢిల్లీ లో క్రొత్త excise policy తీసుకొచ్చారు - ఈ క్రొత్త లిక్కర్ పాలసీ ఏంటి? ఎందుకు తీసుకొచ్చారు? 

ఎందుకు మళ్ళీ 2022 లో కొట్టేసారు? 

MLC కవితకి - ఈ లిక్కర్ స్కాము కి సంబంధం ఏంటి?


"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com

MLC కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కాములో విచారణని ఎదుర్కొంటున్నారు. కాకపోతే తను మహిళ కాబట్టి, ED కార్యాలయాల్లో కాకుండా, తన ఇంటి వద్దే తనను విచారించాలి అని ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు.. 


ఎందుకు ఈ విచారణ? అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి? దాని  background స్టోరీ ఏంటి? 

2021 లో ఢిల్లీ లో క్రొత్త excise policy తీసుకొచ్చారు - ఈ క్రొత్త లిక్కర్ పాలసీ ఏంటి? ఎందుకు తీసుకొచ్చారు? 

ఎందుకు మళ్ళీ 2022 లో కొట్టేసారు? 

MLC కవితకి - ఈ లిక్కర్ స్కాము కి సంబంధం ఏంటి?


ఈ విషయాలు మనం పద్ధతి గా, స్టెప్ బై స్టెప్ చూద్దాం. 

మీకు దణ్ణం పెడతాను. స్కిప్ చెయ్యకుండా వినండి, (కృష్ణ వాయిస్ లో )


ఢిల్లీలోనే కాదు, ఏ గల్లీలోనైనా నీళ్లు లేకపోయినా బ్రతకొచ్చు గానీ, మద్యం లేకుండా బ్రతకడం కష్టం కొంతమందికి  (మ్యూజిక్)

ఇంత ముఖ్యమైన మద్యాన్ని కొనడానికి అమ్మడానికి కొన్ని పాలసీలు కావాలి కదా మరి. 


ఢిల్లీ లో 2021 లో మద్యం అమ్మకాలను క్రమబద్ధీకరించాలి, 

గవర్నమెంట్ కి వచ్చే రెవిన్యూ ని పెంచాలి అని, 

వినియోగదారుల experience ని improve చెయ్యాలని, వివిధ బ్రాండులను అందుబాటులోకి తేవాలని,

బిడ్డింగ్ ప్రాసెస్ లో పారదర్సకతని పెంచి, అవినీతిని తగ్గించాలని  


ఈ ఉద్దేశాలతో క్రొత్త పాలసీ తీసుకొచ్చారు. 

ఉద్దేశాలు బాగున్నాయి కానీ, ఆచరణ? (మ్యూజిక్)


దానికోసం ఏం చేశారు? 

  • అప్పటి వరకు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండే మద్యం వికార్యాలను, ప్రైవేటైజ్ చేసారు. 
  • లిక్కర్ షాపులను జోనులుగా విడగొట్టి 32 జోన్స్ చేశారు
  • ఈ జోనులలో అమ్మాలి అంటే, లైసెన్సులు ఉన్నవాళ్లే అమ్మాలి, కాకపోతే లైసెన్సు బిడ్ చెయ్యాలంటే దానికి  30 కోట్లు డిపాజిట్ చెయ్యాలి ఇక్కడే వాచిపోయింది (మ్యూజిక్)

30 కోట్ల పెగ్గులైతే వేసుంటారేమో గాని జనాలు, (మాట వరసకు చెపుతున్నాను కానీ, అన్ని పెగ్గులేస్తే చచ్చి ఊరుకుంటారు) అంత డబ్బయితే సాధారణ ప్రజల దగ్గర ఉండదు 

  • సో, ఈ లైసెన్సులు కావాలనుకున్న వాళ్ళు బాగా డబ్బున్న వాళ్లే అయ్యుండాలి 


పాలసీ లో వేరే వేరే విషయాలున్నా, ఈ డిపాజిట్ అనేదే పెద్ద ప్రాబ్లెమ్ అయిపోయింది. ఎందుకంటె, దీనివల్ల అందరికి బిడ్డింగ్ లో participate చేసే అవకాశం లేదు. 

  • కొంత మందే బిడ్డింగ్ చెయ్యగలరు. అంటే ఎక్కువమంది బిడ్డింగ్ కి ముందుకు రాకపోతే, గవర్మెంట్ కు డబ్బు కూడా ఎక్కువ రాదు. 
  • బిడ్డింగ్ లో గెలిచిన వాళ్ళు, వాళ్లలో వాళ్ళు కుమ్ముక్కై, రేట్లు ఎంత కావాలంటే అంత పెంచేస్తారు. 


ఇక్కడే కొంచెం తేడా అనిపిస్తున్నది కదా? MLC కవిత కి దీనికి సంబంధం ఏంటి? చివరివరకు వింటే మీకే అర్ధం అవుతుంది.


ఇంతకీ, సిబిఐ, ED (ఎవరో అన్నారు ED అంటే Erectile Dysfunctionనా అని, కాదు, ED అంటే Enforcement Directorate)  ఇవి ఎలా దిగాయి investigation లో? 


ఢిల్లీ చీఫ్ సెక్రటరీ - ఈ లిక్కర్ లైసెన్సింగ్ లో లొసుగులు జరిగాయి అని అనుమానాలు వ్యక్తం చేశారు. వ్యక్తం చేసి ఊరుకోరు ఇటువంటి వాళ్ళు. చీఫ్ సెక్రటరీ ఢిల్లీ Lieutenant  Governor కి చెప్పాడు, ఎందుకంటే ఈయన ఆయనకి బాస్ కాబట్టి. Leiutenant Governor తీస్కపొయి CBI చెప్పేసాడు. అయిపోయింది (మ్యూజిక్). కథ స్టార్ట్ 


పెద్ద పెద్ద నేరాలు, అవినీతి కార్యక్రమాలు ఇటువంటివి సిబిఐ చూసుకుంటే, డబ్బులు ఎలా చేతులు మారాయి, నల్ల ధనం ఎలా పుట్టింది, ఎక్కడికి వెళ్ళింది, ఇవన్నీ ED (ED అంటే ఏంటి అని మళ్ళీ అడగబాకండి. ఇందాకే చెప్పాను Enforcement Directorate) చూసుకుంటుంది. 


లొసుగులు ఎక్కడ ఉంటాయో స్కాములు అక్కడే ఉంటాయి. 

స్కాము జరిగిందా లేదా? అనేది తేల్చి చెప్పడం సిబిఐ, ED వీళ్ళు చూసుకుంటారు. ఇంకా investigation నడుస్తున్నది. 

కాకపోతే, వీళ్ళ అభియోగాలేంటి? 

  • ఈవిధమైన excise పాలసీ వల్ల లిక్కర్ కార్టెల్ ఏర్పడటానికి కారణం అయ్యింది అన్నారు. డ్రగ్ కార్టెల్ అని వినే ఉంటారు. అంటే, ఒక ఏరియా లేదా కొన్ని ఏరియాలలో  లో డ్రగ్స్ అమ్మాలంటే, ఈ డ్రగ్ కార్టెల్ లేదా గ్యాంగ్ మాత్రమే అమ్మాలి. Production నుండి డిస్ట్రిబ్యూషన్, సేల్స్ అన్నీ వెళ్లే చెయ్యాలి. డ్రగ్ కార్టెల్స్ illegal activities తోటే ఇవన్నీ చేస్తారు. లిక్కర్ కార్టెల్స్ కూడా అలానే. కాకపోతే, వీళ్ళు లైసెన్సుల ద్వారా ప్రాంతాల మీద పట్టు సంపాదింస్తారు. అది తేడా. 
  • కుంభకోణం ఏంటి అనేది అర్ధం చేసుకోవాలంటే ముఖ్యంగా 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి: అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, (మనం ముద్దుగా పిళ్ళై అని పిలుచుకుందాం), ఇండో స్పిరిట్స్ మరియు “సౌత్ గ్రూప్”. 
  • ఢిల్లీ లో లైసెన్సుల బిడ్డింగ్ లో హోల్సేల్ లైసెన్స్ పొందిన సంస్థలలో ఒకటి “ ఇండో స్పిరిట్స్”. ఇక్కడే మొదలయింది కథంతా. ఇండో స్పిరిట్స్ కి పిళ్ళై కి సంబంధం ఏంటి? ఈ పిళ్ళై కి ఇండో స్పిరిట్స్ లో 30% దాకా వాటా ఉందని అభియోగం. ఇంకో ఇద్దరికీ తలా 30% వరకు వాటా ఉంది. 
  • మరి ఈ సౌత్ గ్రూప్ ఏంటి? ఇది ED వాళ్ళు పెట్టుకున్న ముద్దు పేరో ఏమో తెలియదు కానీ, ఇది మన దక్షిణ భారతదేశం నుండి  కొంతమంది వ్యక్తుల సమూహం. ఈ వ్యక్తులు ఎవరు అనేది ఇంక కాసేపట్లో చెప్తాను. 
  • ఈ సౌత్ గ్రూప్ మీద అభియోగం ఏంటి? వీళ్లంతా కలిసి, లిక్కర్ కంపెనీలు, హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాపులు ఇలా కొందరితో కలిసి ఒక గ్రూప్ లేదా లిక్కర్ కార్టెల్ గా తయారయ్యి, ఢిల్లీ లో 30% వరకు లిక్కర్ వీళ్ళ ద్వారా వెళ్లేలా కుమ్ముక్కయ్యారు అని. 
    • ఈ సౌత్ గ్రూప్ లో ఎవరున్నారని ED చెపుతున్నది? YSRCP ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అయన కుమారుడు, మాగుంట రాఘవ, అరబిందో ఫార్మా కి చెందిన శరత్ చంద్రా రెడ్డి, చివరికి ముఖ్యంగా మన MLC కవిత గారు (మ్యూజిక్). 
  • ఈ సౌత్ గ్రూప్ కి, పిళ్ళై కి, ఇండో స్పిరిట్స్ కి సంబంధం ఏంటి? 
  •  ఇందాక చెప్పుకున్నట్టు, పిళ్ళై కి ఇండో స్పిరిట్ లో 30% వాటా ఉంటే, ప్రేమ్ రాహుల్ అనే మనిషి కి ఇంకో 30% వాటా ఉంది. ED చెప్పేదేందంటే, పిళ్ళై MLC కవితకి బినామీ అయితే, ప్రేమ్ రాహుల్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కి, ఆయన కుమారుడి కి బినామీ. (మ్యూజిక్) ఇది లింకు. 
  • ఇంకా ED ఏం చెపుతున్నది? ఈ సౌత్ గ్రూప్ తరపున పిళ్ళై కధంతా నడిపించాడు, 100 కోట్ల రూపాయలు AAP పార్టీ కార్య నిర్వాహకులకు ఇచ్చి, ఈ excise పాలసీ రూపకల్పనకు కూడా influence చేశాడు అని, ఇదంతా MLC కవిత డైరెక్షన్ లో, ఆమె ను రెప్రెసెంట్ చేస్తూ చేసాడు అని. ఇది విషయం. 



అసలు MLC కవితగారు నిజంగా ఈ కుంభకోణంలో ఉన్నారా లేదా, ఆమెకు డబ్బు ఎంత వచ్చింది, ఎలా వచ్చింది అనేది పక్కన పెడితే, మనకు ఒక్క విషయం అయితే క్లియర్ గా అర్ధం అయ్యింది. ఏంటయ్యా అంటే, కవితగారు సెల్ ఫోనులు భలే మారుస్తారంట. ఎవరో కాదు ED నే ఈమెని అడిగేసింది (మ్యూజిక్) ఒక ఫోను నెంబర్ కి చెందిన ఫోనులు 3 సార్లు, ఇంకో నెంబర్ కి చెందిన ఫోనులు 4 సార్లు మార్చారంట. కొత్త కొత్త ఫోనులను టెస్టు చెయ్యడం కోసం అయ్యుండొచ్చు (మ్యూజిక్)


సరే విచారణ/ investigation ఇంకా కొనసాగుతున్నా, కవిత గారు సుప్రీం కోర్టులు లో పెట్టుకున్న పిటిషన్ విచారణ  మటుకు ఫిబ్రవరి 28 కి వాయిదా పడింది. 


ఈ 2021 ఢిల్లీ excise పాలసీ నుండి ఎవరికన్నా డబ్బులొచ్చాయో రాలేదో తెలియదు కానీ, ఈ పాలసీ కి వచ్చిన వ్యతిరేకత వల్ల, ఈ విచారణల వల్లనేమో గాని, 2022 లోనే ఆ క్రొత్త excise పాలసీ ని cancel చేసేశారు. ఇంక ముందు విచారణ  ఎలా జరుగుతుందో  చూడాలి. 


మందు బాబులకు మటుకు ఢిల్లీ లో ఎటువంటి అంతరాయం లేకుండా మందు పుష్కలంగా దొరుకుతున్నదనే చెప్పాలి. ఎందుకంటే, మందు చిక్కట్లేదు అని ఎవ్వరు స్ట్రైక్ లు చేయడంలేదు. మందు బాబులకు మటుకు Supply ఆపకూడదు. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం (మ్యూజిక్) 


On that note cheers to everybody!