NewSense - A Telugu Satirical Podcast

ఎలెక్టోరల్ బాండ్స్ చెల్లవని చెప్పిన సుప్రీం కోర్టు - పొలిటికల్ పార్టీలకు సుప్రీమ్ కోర్ట్ లో ఎదురు దెబ్బ

February 23, 2024 Babu - NewSense.Podcast@gmail.com Season 2 Episode 4
ఎలెక్టోరల్ బాండ్స్ చెల్లవని చెప్పిన సుప్రీం కోర్టు - పొలిటికల్ పార్టీలకు సుప్రీమ్ కోర్ట్ లో ఎదురు దెబ్బ
NewSense - A Telugu Satirical Podcast
More Info
NewSense - A Telugu Satirical Podcast
ఎలెక్టోరల్ బాండ్స్ చెల్లవని చెప్పిన సుప్రీం కోర్టు - పొలిటికల్ పార్టీలకు సుప్రీమ్ కోర్ట్ లో ఎదురు దెబ్బ
Feb 23, 2024 Season 2 Episode 4
Babu - NewSense.Podcast@gmail.com

 ఎలెక్టోరల్ బాండ్స్ చెల్లవని చెప్పిన సుప్రీం కోర్టు  - 
పొలిటికల్ పార్టీలకు మెయిన్ గా రూలింగ్ పార్టీలకు సుప్రీమ్ కోర్ట్ లో ఎదురు దెబ్బ  - 
మరి ఫండ్స్ ఎలా వస్తాయి? 
నల్ల ధనం ఆగుతుందా? ఈ  విషయాలు చూద్దాం


"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com

Show Notes Transcript

 ఎలెక్టోరల్ బాండ్స్ చెల్లవని చెప్పిన సుప్రీం కోర్టు  - 
పొలిటికల్ పార్టీలకు మెయిన్ గా రూలింగ్ పార్టీలకు సుప్రీమ్ కోర్ట్ లో ఎదురు దెబ్బ  - 
మరి ఫండ్స్ ఎలా వస్తాయి? 
నల్ల ధనం ఆగుతుందా? ఈ  విషయాలు చూద్దాం


"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com

ఈ  ఎలెక్టోరల్ బాండ్ చట్టం ఎప్పుడు తెచ్చారు? ఎవరు తెచ్చారు? ఎందుకు తెచ్చారు? 

2017 కు ముందు అప్పటి వరకు  కంపెనీలు 20,000 రూపాయల కన్నా ఎక్కువ పొలిటికల్ పార్టీలకు విరాళాలు ఇస్తే, పార్టీలు రికార్డులు చూపించాలి. అప్పుడు బీజేపీ ఏం డెసిషన్ తీసుకుంది? మేము చూపించాము అని డెసిషన్ తీసుకుంది (మ్యూజిక్)


అందుకే 2017 లో బీజేపీ ప్రభుత్వం, కంపెనీలు ఎంతన్నా ఇవ్వొచ్చు అని చట్టాన్ని సవరించింది. 

సవరించి, ఈ కొత్త ఎలెక్టోరల్ బాండ్ స్కీం ని తీసుకొచ్చింది. 2019 నుండి ఇప్పటి వరకు 12 వేల కోట్లు ఈ విధంగా విరాళాల రూపంలో వస్తే బీజేపీ కి ఇప్పటి వరకు అందులో దాదాపు 6 వేల కోట్ల పైనే విరాళాలు. దీన్ని బట్టి బీజేపీ బాగానే ఈ చట్టం సవరణ  వల్ల లాభ పడింది అని చెప్పొచ్చు. 


బాండ్ పద్ధతి అంటే ఏమి లేదు - కంపెనీలు SBI కి వెళ్లి, కొంత డబ్బు కట్టి బాండ్ పేపర్ కొంటారు, కొని ఆ బాండ్ పేపర్ ని తీస్కపొయి వాళ్ళకి నచ్చిన పార్టీ కి ఇస్తారు - ఆ పార్టీ వెళ్లి బాండ్ పేపర్ ని కాష్ చేసుకొని పార్టీ అకౌంట్ లోడబ్బులు  వేసుకుంటారు. 


మనమనుకోవచ్చు. అదేదో డైరెక్ట్ గా కాష్ వాళ్ళకే ఇచ్చేయొచ్చు కదా అని. do not worry, అదీ ఇస్తారు, ఇదీ ఇస్తారు. (మ్యూజిక్)


ఈ సవరణ ప్రకారం, పార్టీలు వాళ్ళకి ఎన్ని  డబ్బులు వచ్చాయి అని చెపితే సరిపోతుంది. ఎవరిచ్చారు ఎంతెంత ఇచ్చారు అని లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు, రికార్డులు చూపించాల్సిన అవసరం లేదు. 


దేముడి హుండీలో డబ్బులేస్తే, తర్వాత ఎవరిచ్చారు, ఎంతెంత ఇచ్చారు, ఎందుకిచ్చారు అని అడగరు. కాకపోతే, తేడా ఏందంటే  దేముడి హుండీ లో వేస్తే పుణ్యము, పొలిటికల్ పార్టీలకు  ఇస్తే, అంతా పాపమే (మ్యూజిక్) 


వెయ్యి, పదివేలు, లక్ష, పది లక్షలు, కోటి ఇలా అవధులు లేకుండా కంపెనీలు  పొలిటికల్ పార్టీలకు  ఇవ్వొచ్చు ఈ సవరణ ప్రకారం. ఇది, బీజేపీ చేసిన గొప్ప పనుల్లో ఒకటి. అని ఎవరో కాదు, బీజేపీ వాళ్ళే చెప్పారు (మ్యూజిక్) 


ఎందుకు ఈ బాండ్ పద్ధతి తెచ్చారు?

బీజేపీ ప్రభుత్వం యేమని చెపుతున్నది? 

ఎలక్షన్స్ లో నల్ల ధనాన్ని తగ్గించడం కోసం ఈ ఎలెక్టోరల్ బాండ్స్ సహాయపడతాయి అన్నారు. అందుకే దీన్ని తీసుకొచ్చాము అన్నారు. 

పారదర్శకత  పెంచాము అన్నారు. అంటే ఎంతెంత డబ్బులు వచ్చాయి అని చెపితే సరిపోతుంది అదే పారదర్శకత అని వీళ్లంటారు. 


మరి ఈ ఆర్గుమెంట్ లో లోపాలున్నాయా? 

ఏమీ లేవు అని బీజేపీ అంటుంది. కానీ అన్నీ లోపలే  అని జనాలంటారు (మ్యూజిక్)

  • ఇచ్చిన డబ్బులు బ్లాక్ మనీ కాదు అని ఎవ్వరూ చెప్పలేరు. బ్యాంకు లో డిపాజిట్ చేస్తే బ్లాక్  వైట్ అవుతుంది. ఈ విధంగా బ్లాక్ మనీ ని వైట్ చేసి డొనేట్ చేసినట్టు చూపించుకోవచ్చు. నీకెక్కడివి ఈ డబ్బులు అని ఎవ్వరు అడగరు. పైగా ఈ విధంగా డొనేట్ చేసిన డబ్బులకు టాక్స్ ఉండదు. 
  • ఏ కంపెనీ నుండి ఈ డబ్బులు వస్తున్నాయి? ఆ కంపెనీ ఒక షెల్ కంపెనీ అయ్యుండొచ్చు. 
    • షెల్ కంపెనీ అంటే ఏంటి? ఈ షెల్ కంపెనీలు పేపర్ మీద మాత్రమే ఉంటాయి. కొన్నింటికి ఆఫీసులు కూడా ఉండవు. కొన్నిటికి ఆఫీసులు ఉంటాయి, website లు ఉంటాయి, బిజినెస్ కార్డులు కూడా ఉంటాయి. అయినా ఇవి పేరుకి మాత్రమే. అంటే అస్సలు పనులేమీ చెయ్యవు. 
    • మరి ఏమీ చెయ్యని దానికి కంపెనీ ఎందుకు? అక్కడికే వస్తున్నా.  
    • ఈ కంపెనీలు బ్లాక్ మనీ ని వైట్ మనీ గా మార్చడం కోసం సహాయ పడతాయి. 
    • ఎలా? ఒకడుంటాడు. వాడికి ఫుల్ గా బ్లాక్ మనీ ఉంది. ఈ బ్లాక్ మనీ ఎలా వస్తుంది అనేది కూడా చూద్దాం తర్వాత. ఈ బ్లాక్ మనీ ఉన్నోడికి, ఈ షెల్ కంపెనీ ఒక invoice ఇస్తుంది. Invoice అంటే, చేసిన పనికి డబ్బులు కట్టమని చెప్పే బిల్లు. నిజానికి ఈ షెల్ కంపెనీ ఏమి పని చెయ్యచెయ్యదని చెప్పుకున్నాం ఇందాక. అంటే, ఏమి పని చెయ్యకుండా, ఉట్టొట్టి బిల్ ఇస్తారు. ఈగలు తోలుకుంటూ మధ్య మధ్యలో “ఇదిగో invoice” అని ఇస్తూఉంటారు (మ్యూజిక్)
    • ఆ invoice ని తీసుకొని, ఈ బ్లాక్ మనీ ఉన్న మనిషి, ఈ షెల్ కంపెనీ బ్యాక్ అకౌంట్ లో డబ్బులేస్తాడు, నువ్విచ్చిన సర్వీస్ కి ఇవిగో డబ్బులూ అని. ఉత్తిత్తికినే. 
    • ఈ విధంగా బ్లాక్ మనీ వైట్ అయిపోయినట్టే. 
    • సో, ఈ షెల్ కంపెనీలు బ్లాక్ మనీ ని తీస్కపొయి పొలిటికల్ పార్టీలకు ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో కొనేసి డొనేట్ చెయ్యొచ్చు 
  • డబ్బులు  ఎవరు ఎంత ఇస్తున్నారు అని పట్టించుకోరు. డొనేట్ చేసే డబ్బులు కంపెనీ కి ఎక్కడివి అని పట్టించుకోరు అంటే, అది షెల్ కంపెనీ నా కాదా అని ఎవ్వరు చూడరు
  • చివరికి ఎందుకిస్తున్నారు? అనే ప్రశ్న కూడా అడగరు. ఈ ప్రకారంగా ఒక కంపెనీ “ఈ కోటి రూపాయలు తీసుకొని, ఆ గవర్నమెంట్ కాంట్రాక్టు నా కంపెనీకి ఇచ్చెయ్యి” అన్న understanding తోటి డొనేట్ చేస్తే? ఈ విషయం ఆ కంపెనీ కి, రూలింగ్ పార్టీ కి మాత్రమే తెలుసు. ప్రజలకు తెలియదు. దీన్నే quid pro quo అని కూడా అంటారు. నువ్వు నీ biscuit ఇస్తే, నేను నా చాక్లెట్ ఇస్తాను  అన్నారనుకోండి, అదికూడా క్విడ్ ప్రో quo నే అంట , మనకు తెలియదు ఇంతకు  ముందు వరకు (మ్యూజిక్). దాన్ని పక్కన పెడితే, 
  • డబ్బులు ఎవరు, ఎంత ఇచ్చారో తెలియదు, ఆ డబ్బులు ఎలా వచ్చాయో తెలియదు, ఎందుకు ఇస్తున్నారో తెలియదు. దీన్ని ఒక చట్టం గా చేస్తే, పారదర్శకత ఎక్కడ మళ్ళి? ఎక్కడ నుండి వస్తుంది? నా బొంద లో నుంచి వస్తుంది (మ్యూజిక్) 


అందుకే సుప్రీం కోర్టు  ఏమన్నదీ?: 

ఇవే ప్రశ్నలు అడిగింది. 

  • డబ్బులు ఎవరు, ఎంత, ఎందుకు ఇస్తున్నారు అనే విషయాలు తెలుసుకునే హక్కు ప్రజలకుంది. కాబట్టి, షేర్ చెయ్యాలి అన్న సూచనలు లేవు కాబట్టి, ఈ ఎలెక్టోరల్ బాండ్స్ అనేవి చెల్లవు అని తేల్చి చెప్పేసింది. లేనోడికి అన్నదానం చేస్తే అది ఒక రకం. ఉన్నోడిని పిలిచి అన్నదానం చేస్తే, సోపు రాస్తునాడు అని అర్ధం (మ్యూజిక్)
  • అంతే కాకుండా, అంతకు ముందు కంపెనీలు వాళ్ళ ప్రాఫిట్స్ లో maximum 7.5% కన్నా ఎక్కువ పొలిటికల్ పార్టీలకు ఇవ్వకూడదు అన్న రూల్ ని మళ్ళీ పెట్టేసింది. ఇంకేముంది పార్టీలకు చితికిపోయింది (మ్యూజిక్)
  • ఇప్పటి వరకు 2019 నుండి ఎవరెవరు, ఏ ఏ పొలిటికల్ పార్టీల కి ఎంతిచ్చారో ఆ లెక్కలు బయట పెట్టాల్సిందే అని SBI కి చెప్పేసింది. దీనితోటి, పార్టీలకు చినిగి చాటయ్యింది (మ్యూజిక్)


ఈ సుప్రీం కోర్టు తీర్పు తోటి, ప్రజాస్వామ్య వాదులు, ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ అని పండగ చేసుకున్నారు (మ్యూజిక్)

కాకపోతే ఈ లెవెల్ లో కాకా పోయిన, రాజకీయ పార్టీలు కూడా పండగ చేసుకున్నాయి (మ్యూజిక్). 


ఎందుకు? దొంగ దారుల్లో డబ్బులు సేకరించడం అనే మార్గాన్ని ఎవ్వరూ మూసెయ్యలేరు కాబట్టి. 

ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చే డబ్బులు ఒక వంతు అయితే, మిగిలిన మార్గాలలో వచ్చే డబ్బు ఇంకో వంతు. 


లోక్ సభ ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టే డబ్బు కోటి రూపాయలకన్నా ఎక్కువ ఉండకూడదు. కానీ 10 కోట్లు, వంద కోట్లు ఖర్చు పెడతారు 

అసెంబ్లీ ఎన్నికల్లో 20 లక్షల నుండి 40 లక్షల వరకు ఖర్చు చెయ్యొచ్చు (రాష్ట్రాన్ని బట్టి). కానీ నిజంగా ఖర్చుపెట్టే డబ్బు కనీసం 10 నుండి 100 రెట్లు ఉంటుంది. ఎక్కడిదీ డబ్బు? 


డైరెక్ట్ కాష్ ఇది, బ్లాక్ అయినా అయ్యుండొచ్చు,  వైట్ అయినా, హవాలా డబ్బు, బినామీ లావాదేవీల నుండి వచ్చిన డబ్బు. ఇవన్నీ బ్లాక్ మనీ క్రిందకే వస్తాయి. ఈ డబ్బుని సుప్రీం కోర్టు కాదుకదా, ఏ కోర్టు కూడా కంట్రోల్ చెయ్యలేదు. 


కాకపోతే, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గుడ్డిలో మెల్ల. 

అసలు ఏమి లేనిదానికన్నా, ఏదో ఒకటి ఉండటం మిన్న (మ్యూజిక్)